ఈ రోజే రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న‌ కూతురి బార‌సాల‌.. ఇంత‌కీ మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరేంటో..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన‌ సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత ఈ ల‌వ్లీ కపుల్ తమ ఫస్ట్ చైల్డ్ కు వెల్కమ్‌ చెప్పారు. గత ఏడాది గర్భం దాల్చిన ఉపాసన.. జూన్ 20వ తేదీన అపోలో హాస్పటల్ లో పండంటి ఆడబిడ్డ‌కు జన్మనిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే నేడు రామ్ చరణ్ ఉపాసన కూతురి బార‌సాల వేడుక జరగబోతోంది. మెగా లిటిల్ ప్రిన్సెస్ నేమింగ్ సిరిమోనీ కి సంబంధించి ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. త‌మ డార్లింగ్ కు ఈ రోజు పేరు పెట్ట‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసింది.

రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస కూతురి బార‌సాల వేడుక‌లో కొణిదెల‌, కామినేనితో పాటు అల్లు ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా సంద‌డి చేయ‌బోతున్నారు. అలాగే మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరును ఇప్పటికే ఖరారు చేశారు. ఈ రోజే అఫీషిల్ గా అనౌన్స్ చేస్తారు. మ‌రి రామ్ చ‌ర‌ణ్ కూతురి పేరేంటో తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే. కాగా, రామ్ చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `గేమ్ ఛేంజ‌ర్` మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ అనంత‌రం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు.