ఫస్ట్ టైమ్ చైతన్య-సమంత గురించి షాకింగ్ కామెంట్లు చేసిన ప్రితమ్..!!

టాలీవుడ్లో హీరోయిన్లకు సైతం స్టైలిష్ డిజైనర్ గా పేరు పొందారు ప్రీతమ్ జుకాల్కర్.. ముఖ్యంగా సమంతా వల్ల తన పేరు మంచి పాపులారిటీ అయిందని చెప్పవచ్చు. సమంతతో క్లోజ్ గా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడం వల్ల తన మీద ఎన్నో రకాల ట్రోలింగ్లు కూడా ఎదుర్కోవడం జరిగింది. అయితే ఇన్ని రోజులకు తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను తనపై వచ్చిన ట్రోలింగుల పైన స్పందించడం జరిగింది.వాటి గురించి తెలుసుకుందాం.

ప్రితమ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చాను కేవలం సమంత తన ప్రతిభను నమ్మి తనని ప్రోత్సహించిందని ఆమె ప్రోత్సాహం వల్లే నేను మొదటిసారిగా స్టైలింగ్ వైపుగా అడుగు వేశాను కానీ చాలామంది మా ఇద్దరిని విమర్శించడం జరిగింది.. కొంతమంది సమంతాన్ని కూడా అనరాని మాటలు అన్నారు..ఆ విషయాలు విని చాలా బాధేశాయి.. తనేమి చెడ్డవాడిని కాదని తనకు కూడా కొన్ని నైపుణ్యాలు ఉన్నాయని తెలిపారు.. హీరోయిన్ల కి ఎందుకు డిజైనర్గా చేస్తున్నాను అంటే హీరోయిన్లు ఎలాంటి ప్రయోగాల కైనా ఒప్పుకుంటారు.. కానీ హీరోలు మాత్రం సరికొత్త కాస్ట్ డిజైన్ వేసుకోవడానికి ఇష్టపడరని తెలిపారు.

Samantha's stylist Preetham Jukalker says Naga Chaitanya could have put an  end to rumours - India Today
ఇక గతంలో సమంతా తనతో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో తన మీద ట్రోల్ జరిగిందని వెంటనే ఆ ఫోటోలు డిలీట్ చేసింది.. అది చూసి ఏవేవో కామెంట్లు చేశారు కేవలం మా ఇద్దరి మధ్య అన్నాచెల్లెళ్ల బంధం ఉందని మేము స్నేహితులం మాత్రమే అని తెలిపారు. నాగచైతన్యత సమంత విడిపోయినప్పుడు.. తన కుటుంబాన్ని కూడా లాగారని ప్రీతం చాలా బాధపడ్డారని తెలిపారు. చైతన్య కూడా చాలా మంచివారు.. తను కలిసిన మంచి వ్యక్తులలో అతను కూడా ఒకరిని తెలిపారు ప్రీతమ్.. తన కెరియర్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాననీ తెలిపారు ప్రితమ్.