Polimera: మా ఊరి పొలిమేర-2 నుంచి అదిరిపోయే అప్డేట్..!!

2021 నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన థ్రిల్లర్ చిత్రం మా ఊరి పొలిమేర.. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతోమంది అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్కుని కూడా రివీల్ చేయడం జరిగింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమాలో నటించిన కామాక్షి భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా హీరో బాలాదిత్య ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టును షేర్ చేయడం జరిగింది.

కామాక్షి భాస్కర్లకు బర్తడే విషెస్ తెలియజేస్తూ మంచి ఆరోగ్యం భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఒక పోస్టర్ని షేర్ చేయడం జరిగింది.. ఇది పొలిమేర-2 సినిమాకు సంబంధించింది ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో కామాక్షి పేరైన లచిమి అనే పాత్రను ప్రస్తావిస్తూ కామాక్షి తాను కలిసి ఉన్న సినిమాలోని ఒక సన్నివేశాన్ని తెలిపే ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోకు మరొక పక్కా కామాక్షి గట్టిగా అరుస్తున్నట్టుగా చూపించడం జరిగింది.

లచిమి కామాక్షి భాస్కర్ల అని ఉండగా దాని కిందే మా ఊరి పొలిమేర-2 అనే టైటిల్తో అత్యంత ఆసక్తికరంగా ఈ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. మా ఊరి పొలిమేర-2 సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో సత్యం రాజేష్ డాక్టర్ కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను బాలాదిత్య రవి వర్మ నటించారు. ఈ చిత్రాన్ని ఉత్తరకాండ కేరళ ఆంధ్రప్రదేశ్ హైదరాబాదులో అనేక ప్రాంతాలలో చిత్రీకరించారు. మా ఊరి పొలిమేర-2 సినిమా మొదటి భాగం కంటే రెండో భాగమే మరింత ఉత్కంఠంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాని విడుదల చేసే సందర్భంగా ప్రతి అప్డేట్ ను విడుదల చేస్తున్నారు ఈ ఏడాది మేలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.