శ్రీలీల ఎంట్రీతో ఆ ఇద్దరు హీరోయిన్లు సైడ్ అయిపోతున్నారు..

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ అనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు. లక్ బాలేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజులకే వారి కెరీర్ ముగిసిపోతుంది. ఆ తరువాత ఎలాంటి పాత్రలు వచ్చినా చెయ్యక తప్పదు. అలా చాలామంది హీరోయిన్లు కొంతకాలం హీరోయిన్లుగా నటించి ఆ తరువాత తల్లి పాత్రలలో నటించి ఇంకా కొంతకాలానికి అమ్మమ్మ పాత్రలో నటించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న సమంత, తమన్నాల కెరీర్ కూడా త్వరలోనే ముగిసిపోతుందని వార్తలు వస్తున్నాయి.

ఒకప్పుడు ఈ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీని బాగా షేక్ చేసారు. స్టార్ హీరోలందరూ ఎక్కువగా వారి సినిమాలలో సమంత, తమన్నాలనే హీరోయిన్స్‌గా ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. గత రెండు, మూడేళ్లుగా సామ్, తమన్నాలు పెద్దగా హిట్ కొట్టలేకపోతున్నారు. అవకాశాలు వచ్చినప్పటికీ వరుసగా పరాజయాన్ని చవిస్తున్నారు ఈ ఇద్దరు భామలు. అంతేకాకుండా ఒకప్పుడు వీరికి అవకాశం ఇచ్చిన స్టార్ హీరోలు ఇప్పుడు వీరిని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతానికి సమంత, తమన్న చిన్న హీరోల సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే ఈ స్టార్ హీరోయిన్స్‌కి ఇలాంటి గతి పట్టడానికి ఒక యంగ్ హీరోయిన్ అని తెలుస్తుంది.

అయితే ఆ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు శ్రీలీల. ఈ అమ్మడు నటించింది రెండు సినిమాలే అయినా ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దాంతో ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు వారి సినిమాలలో శ్రీలీలనే హీరోయిన్‌గా ఉండాలని కోరుకుంటున్నారట. దానికి కారణం ఈ అమ్మడు అందం, నటన, డ్యాన్స్ తో పాటు టాలెంట్. అందుకే స్టార్ హీరోలు ఎక్కువగా శ్రీలీలకే ఓటు వేస్తున్నారు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

‘ధమాకా ‘సినిమా తర్వాత దర్శకులు,హీరోలందరూ శ్రీలీల కోసం క్యూ కట్టారు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలకృష్ణ,మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉంది. ఈ అమ్మడికి క్రేజ్ పెరగడంతో తమన్నా, సమంతల సైడ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.