సినిమాల‌కు కాజ‌ల్ గుడ్‌బై.. ఈ క్లారిటీ స‌రిపోతుందా..?

సౌత్ స్టార్ బ్యూటీ కాజల్ అగ‌ర్వాల్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్.. ఇప్పుడు మరోసారి గర్భం దాల్చిందని.. త్వరలోనే ఆమె తన రెండో బిడ్డకు ఆహ్వానం పలకపోతోందని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ కారణంగానే ఆమె సినిమాలకు స్వస్తి పలికి.. ఇకపై ఫ్యామిలీతో లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటుందని టాక్ న‌డిచింది. అయితే ఈ విషయంపై కాజల్ అదిరిపోయే క్లారిటీ ఇచ్చింది. నెట్టింట జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలుపుతూ తాజాగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసింది. ఆల్రెడీ కాజల్ చేతిలో భగవంత్ కేసరి, ఇండియన్ 2 వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా ఈ అమ్మ‌డు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి సైన్‌ చేసింది.

`కాజల్60` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ ను మేక‌ర్స్‌ బయటకు వదిలారు. అఖిల్ డేగల దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం అవురమ్‌ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నిర్మితం కానుంది. నేడు ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. అలాగే ఈ సినిమాలో మున్నెప్పుడూ కనిపించని డిఫరెంట్ పాత్రలో కాజల్ అల‌రించబోతోంది. ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ తో కాజల్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆమె సినిమాలకు దూరం కాబోతోంది అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూడా తేలిపోయింది.