హీరోయిన్ కృతి సనన్ గురించి తెలియని విషయాలు ఇవే..!!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటించింది.. ఈ సినిమా ఈనెల 16వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మొదటి రోజు దాదాపుగా రూ .250 కోట్ల రూపాయలకు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. సీత పాత్రకు కృతి సనన్ కు ప్రశంసలు అందుకుంది. అయితే ఈమె గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

From dream destinations, her most annoying habit, to how she likes her  coffee — when Kriti Sanon revealed it all | Lifestyle News,The Indian  Express

కృతి సనన్ 1990 జులై 27న ఈమె ఢిల్లీలో జన్మించింది మొదట మోడలింగ్ రంగం వైపు అడుగు వేసిన ఈ ముద్దుగుమ్మ పలు రకాల యాడ్స్ ద్వారా నటించింది. మొదటిసారి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన నేనొక్కడినే సినిమాతో మహేష్ కు జోడిగా నటించింది. ఆమె చేసిన మొదటి సినిమా తెలుగు సినిమా కావడం గమనార్హం.. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది ఇటీవలే.. మిమి అనే సినిమాలో ఈమె గర్భవతిగా కనిపించడం కోసం దాదాపుగా 15 కేజీల బరువు పెరిగిందట.

కృతి సనన్ కు ఇష్టమైన హీరోయిన్ ప్రియాంక చోప్రా.. అయితే ఈమెకు సముద్రంలో ఎక్కువగా డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టమట. ఈమెకు కవితలు రాసే అలవాటు కూడా ఉన్నదట.. అలాగే సొంతంగా..MS.TAKEN అనే దుస్తుల బ్రాండ్ ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈమె ఒక మంచి డాన్సర్ కథకు నాట్యంలో ఈమె శిక్షణ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కృతి సనన్ గురించి ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.