పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి అందరికీ తెలిసిందే. రెండు సార్లు వైవాహిక బంధంలో విఫలం అయిన పవన్ కళ్యాణ్.. మూడో ప్రయత్నంగా అన్నా లెజ్నెవాతో ఏడడుగులు వేశాడు. రష్యాకు చెందిన అన్నాను 2013లో పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక మోడల్. తీన్మార్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్, అన్నా మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారడంతో.. పెళ్లి చేసుకున్నారు.
ఈ దంపతులకు ఇద్దరు సంతానం. అన్నా ఇండియాకు చెందిన అమ్మాయి కాకపోయినా.. ఇక్కడి ఆచారాలు, పద్ధతులు చక్కగా పాటిస్తుంది. పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నాక.. ఆమె హిందూ మతంలోకి మారింది. అలాగే మెగా ఫ్యామిలీతో సైతం చాలా త్వరగా కలిసిపోయింది. ఇకపోతే టాలీవుడ్ లో అన్నాకు ఓ ఫేవరెట్ హీరో ఉన్నాడట. భర్త పవన్ కళ్యాణ్ కంటే ఆ హీరోనే అన్నాకు ఎక్కువ ఇష్టమట.
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును, మహేష్ బాబు అంటే అన్నాను ఎంతో అభిమానం అట. ఆయన నుంచి ఈ సినిమా విడుదలైనా ఖచ్చితంగా చూస్తుందట. అంతేకాదు, మహేష్ బాబు సతీమణి నమ్రత, అన్నా మంచి స్నేహితులు. ప్రతి క్రిస్మస్ కు మహేష్ దంపతులకు అన్నా గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటుంది. కాగా, పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్ లు కూడా ఆయన చేతిలో ఉన్నాయి.