హనీ రోజ్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` మూవీతో టాలీవుడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. తనదైన అందంతో అందరినీ ఆకట్టుకుంది. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
వీర సింహారెడ్డి సూపర్ హిట్ అవడంతో హనీ రోజ్ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు.. షాపింగ్ మాల్స్, షోరూమ్స్ ఓపెనింగ్స్ కు మాత్రమే పనికొస్తోంది. వీర సింహారెడ్డి తర్వాత తెలుగులో హానీ రోజ్ ఒక్క ప్రాజెక్ట్ కు కూడా సైన్ చేయలేదు. ఇందుకు కారణం ఉందట.
హనీ రోజ్ చేసిన తప్పు వల్లే ఆమెకు ఆఫర్లు లేకుండా పోయాయని ఓ టాక్ బయటకు వచ్చింది. అదేమిటంటే వీర సింహారెడ్డి విడుదల తర్వాత తెలుగులో పలు సినిమాల్లో హనీ రోజ్ కు అవకాశాలు వచ్చాయట. అయితే హీరోయిన్ గా కాకుండా సహాయక పాత్రల కోసం ఆమెను అడిగారట. దాంతో హనీ రోజ్ హీరోయిన్ రోల్ అయితేనే చేస్తానని చెప్పి.. ఆయా ఆఫర్లను రిజెక్ట్ చేసిందట. దాంతో వచ్చే అవకాశాలు కూడా హనీ రోజ్ కు రాకుండా పోయాయి. అందుకే టాలీవుడ్ లో హనీ రోజ్ కు ఇప్పుడు చేయడానికి సినిమాలు లేవని అంటున్నారు.