పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` జూన్ 16న అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. అలాగే రావణాసురుడు పాత్రను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూ వచ్చాయి.
అయినాసరే బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. ఇకపోతే ఈ సినిమాలో కృతి సనన్ తో పాటు మరొక హీరోయిన్ ఉంది. ఆమెనే సోనాల్ చౌహాన్. ఈ బ్యూటీ రావణాసురుడు అయిన సైఫ్ అలీ ఖాన్ సతీమణి మండోదరి పాత్రలో మెరిసింది. అయితే డైరెక్టర్ ఓం రౌత్ ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.
కేవలం రెండు సీన్స్ కు మాత్రమే పరిమితం చేశారు. సోనాల్ చౌహాన్ స్క్రీన్ టైమ్ కూడా ఐదు నిమిషాల కంటే తక్కువే ఉంటుంది. అయినప్పటికీ కూడా సోనాల్ ఈ సినిమాకు గట్టిగానే ఛార్జ్ చేసిందని అంటున్నారు. రెండు సీన్ల కోసం సోనాల్ మహా అయితే రెండు రోజులు షూటింగ్ లో పాల్గొని ఉంటుంది. ఆ మాత్రానికే ఆమె ఏకంగా రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ పుచ్చుకుందని టాక్ నడుస్తోంది. కాగా, సోనాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో ఆమె పలు చిత్రాల్లో మెరిసింది. చివరిగా నాగార్జున `ది ఘోస్ట్` మూవీలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.