టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా నటిస్తున్న వారిలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఒకరు.. తమిళ సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది నాగచైతన్యతో కలిసి ఒక లైలా కోసం మన చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.. దాదాపుగా టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోల సరసన అందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లు అందుకోలేక పోతోంది.
దీంతో బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకుంటే పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది అక్కడ కూడా సక్సెస్ కాలేకపోతోంది పూజా హెగ్డే. ఇలాంటి సమయంలోనే ఈమె పలు సినిమాలను వదులుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే ఈ చిత్రాలను వదులుకుందో లేదో మరో కారణం ఉందో తెలియదు కానీ.. స్టార్ హీరోల సినిమాలను వదులుకున్నది. పూజ హెగ్డే మిస్ చేసుకున్న చిత్రాలలో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంలో ఈమె హీరోయిన్గా అన్నట్టుగా మొదట పలు వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఈమే ప్లేస్ లో శ్రీలీల ను తీసుకురావడం జరిగింది.
అలాగే హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన జనగణమన అనే చిత్రంలో హీరోయిన్గా అనౌన్స్మెంట్ చేయక ఆ సినిమా ఆగిపోయింది.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్లో ముందుగా హీరోయిన్గా పూజ హెగ్డే అని అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది. కేవలం పూజా హెగ్డే చేతిలో గుంటూరు కారం అనే సినిమా మాత్రమే ఉంది. అయితే ఈమెకు వరుస ఫ్లాపులు వస్తున్న సమయంలో దర్శక నిర్మాతలు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక పూజా హెగ్డేనా సినిమాల నుంచి తప్పిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.