త్రిష కూడా పెంచేసింది రోయ్‌.. ఇక ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చుక్క‌లే!?

సుదీర్గకాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్న చెన్నై చంద్రం త్రిష.. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన‌ పొన్నియన్ సెల్వన్ సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకుని మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చింది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో త్రిష ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ మూవీతో త్రిషకు పూర్వ వైభ‌వం వ‌చ్చిన‌ట్లైంది. స్టార్ హీరోల సినిమాల నుంచి ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి.

ప్ర‌స్తుతం విజయ్ దళపతికి జోడీగా `లియో` సినిమా చేస్తోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత వీరిద్ద‌రూ మ‌ళ్లీ జోడీ క‌డుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అలాగే అజిత్ నూత‌న చిత్రం `విడా ముయర్చి` లోనూ త్రిష హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే క‌మ‌ల్ హాస‌న్ తో ఓ మూవీకి క‌మిట్ అయింది. వీటితో పాటు మ‌రికొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న త్రిష‌.. త‌న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేసింది.

ఈ అమ్మ‌డు ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు ఛార్జ్ చేస్తుంద‌ట‌. ఇక‌పై త్రిష ఏ ప్రాజెక్ట్ కు సైన్ చెయ్యాల‌న్నా.. ఆమె అకౌంట్ లో రూ. 10 కోట్లు ప‌డాల్సిందే అని అంటున్నారు. ఇదే గ‌నుక నిజ‌మైతే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మని అంటున్నారు. మొత్తానికి సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్న హీరోయిన్లు న‌య‌న‌తార‌, స‌మంత మాత్ర‌మే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో త్రిష కూడా చేరిపోయింద‌ని అంటున్నారు.