పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. అమ్మ ఎవరంటే..?

జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ కెవ్వు కార్తీక్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్తీక్ అంటే గుర్తుపట్టే వారు చాలా తక్కువ మందే ఉంటారు.. కానీ కెవ్వు కార్తీక్ అంటే అందరూ గుర్తుపడతారు. త్వరలోనే ఈ కమెడియన్ ఒక ఇంటి వారు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది.. తనకు కాబోయే భార్యతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

Jabardasth Comedian Kevvu Karthik To Open New Chapter In His Life - Sakshi

కెవ్వు కార్తీక్ తన ఇంస్టాగ్రామ్ లో ఇలా పోస్ట్ చేస్తే” మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది బహుశా అది ఇదే కావచ్చు.. నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్యూ బ్యూటిఫుల్ నీతో కొత్త జీవితాన్ని వీలైనంత తొందరగా మొదలు పెట్టాలని ఎదురుచూస్తున్నాను “అంటూ రెండు ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది కెవ్వు కార్తిక్.. అయితే ఈ రెండు ఫోటోలలో అమ్మాయి ముఖం మాత్రం చూపించలేదు.. ఇది చూసిన నెటిజన్లు.. పలువురు జబర్దస్త్ కామెడీయన్స్ సైతం కార్తీక్కుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కార్తీక్ తన కెరియర్ లో ఎన్నో కష్టాలు దాటుకొని సెలబ్రెటీ స్థాయికి చేరాడని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన కార్తీక్ సినిమాల పైన మక్కువ ఉండడంతో హైదరాబాదులో మిమిక్రీ ఆర్టిస్టుగా పనిచేశారట ..ఆ తర్వాత కామెడీ క్లబ్ అనే షో తో గుర్తింపు రావడంతో జబర్దస్త్ సోలోకి కంటిస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన కెవ్వు కార్తిక్ టీమ్ లీడర్ గా మారి బాగానే ఆకట్టుకుంటున్నారు. అయితే కార్తీక్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ఎలాంటి విషయాలు తెలియలేదు..తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Kevvu Kartheek (@kevvukartheek)