కోర్టును ఆశ్రయించిన హీరోయిన్ డింపుల్ హయాతి..!!

సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్గా పేరుపొందింది డింపుల్ హయాతి.. ఇటీవలే గోపీచంద్ తో కలిసి రామబాణం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజుల క్రితం ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఐపీఎస్ అధికారి డిసిపి రాహుల్ హెగ్డే కు హీరోయిన్ డింపుల్ హయాతి మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. డీసీపీ కారుని కాలుతో తన్నడమే కాకుండా తన బెంజ్ కారుతో రివర్స్లో వచ్చి ఢీ కొట్టిందని వార్తలు వినిపించాయి.

Threatening calls to actress Dimple who confronted an IPS officer Dimple  Hayathi Vs IPS Rahul Hegde, Dimple Lawyer Said Actress Receiving Threat  Calls Pipa News - PiPa News
దీంతో ఈ నటి పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ వివాదం పై డింపుల్ హయాతి తాజాగా హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ డిసిపి ఒత్తిడితో తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆమె హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.. అంతేకాకుండా ఆమెకు CRPC 41 A కింద నోటీసులు ఇచ్చినట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు.. వాదనను విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిబంధన మేరకు వ్యవహరించాలని పోలీసులకు ఆదేశించడం జరిగింది.

కాగా ఐపీఎస్ అధికారి ట్రాఫిక్ డిసిపి రాహుల్ యగ్డే కారుపై దాడి చేసే అరుణ కారణంతో ఆయన డ్రైవర్ చేతన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే హీరోయిన్ డింపుల్ హయాతి డేవిడ్ అనే వ్యక్తి పైన పోలీస్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో మళ్లీ డింపుల్ హయాతి న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించడంతో ఈ విషయం వైరల్ గా మారుతోంది. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తుందేమో చూడాలి మరి.