హీరోయిన్ అనుష్కకు అలాంటి వ్యాధి.. షాక్ లో ఫ్యాన్స్..!!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.. మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాతో ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత అరుంధతి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో అద్భుతమైన నటనను ప్రదర్శించింది.

Anushka Shetty celebrates 17 years in film industry; tweets gratitude
ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం తెచ్చుకున్న అనుష్క ఇండస్ట్రీలో స్వీటీగా పేరు సంపాదించింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలీ శేట్టి సరసన సినిమాలో నటిస్తోంది. ఆ చిత్రమే మిస్ శెట్టి. ఈ చిత్రంలో అనుష్క చెఫ్ గా కనిపించబోతోంది. అయితే తాజాగా అనుష్కకు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఒక అరుదైన వ్యాధి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ వార్త తెలిసి అభిమానులు కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అనుష్కకు ఉన్న వ్యాధి అంత భయంకరమైనది కాదట.

అనుష్కకు ఉన్న వ్యాధి ఏమిటంటే ఆమె నవ్వితే ఆగకుండా 10 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటుందట. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్న కూడా నవ్వు ఆపుకోలేదట అనుష్క శెట్టి.. దీంతో సినిమా షూటింగ్ సమయంలో ఇది చాలా ప్రాబ్లంగా మారుతూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గతంలో చాలా వార్తలు వినిపించాయి. ఇది తెలిసిన అభిమానులు కాస్త షాక్ అవుతున్నారు. ప్రస్తుతం అనుష్క శెట్టి కి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.