ఇండియాలోనే అత్యంత ధనికుడైన కమెడియన్ ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా పేరు సంపాదించిన నటుడు బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. వెయ్యికి పైగా చిత్రాలలో నటించి గిన్నిస్ రికార్డు స్థాయిని చేరుకున్న హాస్యనటుడు బ్రహ్మానందం ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు. ఈ మధ్యకాలంలో తన హవా కాస్త తగ్గించిన గతంలో బ్రహ్మానందం లేకుండా ఏ ఒక్క సినిమా కూడా విడుదల అయ్యేవి కావు. కేవలం బ్రహ్మానందం కామెడీ మీదే ఎన్నో చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి.

Brahmanandam undergoes heart surgery | Entertainment News,The Indian Express

బ్రహ్మానందం పేరులోని ఆనందం ఉందని చెప్పవచ్చు. నటుడుగా ఉన్నత శిఖరాలకు చేరిన బ్రహ్మానందం నటన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించారు. హాస్యంతో ఎమోషనల్ పాత్రలతో ఆయన మెప్పించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేమని చెప్పవచ్చు. లైఫ్ లో ఎలాంటి బంగపాటు లేకుండా ఇలా ఇప్పటివరకు సాఫీగా సాగించడం అది కూడా సినీ ప్రపంచంలో బ్రహ్మానందానికి మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. అయితే బ్రహ్మానందం తన సుదీర్ఘ కెరియర్ లో సంపాదించిన నికర ఆస్తి విలువ ఎంత ఉండవచ్చు అంటూ పలువురు అభిమానులు డెబిట్ కొనసాగిస్తున్నారు.

సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కో చిత్రానికి బ్రహ్మానందం రూ .2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.దాదాపుగా ఆయన ఆస్తి విలువ రూ .550 కోట్ల రూపాయల మేరకు ఆస్తులు కలిగి ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. బ్రహ్మానందం ఇండస్ట్రీలోకి వచ్చి అది తక్కువ సమయంలోనే ఇంతటి ఆస్తి సంపాదించడం అంటే ఆశ మాసి విషయం కాదు. ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్ గా కూడా పేరు సంపాదించారు బ్రహ్మానందం.