ప్రాజెక్ట్- కే కోసం కమలహాసన్ ఎంత తీసుకున్నారో తెలుసా..?

విక్రమ్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కమలహాసన్ ఈ సినిమాని తన బ్యానర్ పైన తెరకెక్కించి భారీగా కలెక్షన్లను సంపాదించారు. తన బ్యానర్ పైన ఎన్నో చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న కమలహాసన్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-K చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఆది పురుష్ చిత్రం కూడా ఈ రోజున విడుదలై సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్-K చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.

Project K Makers Approached Kamal Haasan & Offered 150 Crore To Play An  Antagonist In Prabhas Starrer? Here's What We Know
ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. అలాగే అమితాబచ్చన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. దిశాపటాని కూడా నటిస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కమల్ హాసన్ ఇందులో విలన్ గా నటించబోతున్నారని ఈ సినిమా షూటింగ్ కోసం డేట్లు కూడా కేటాయించారని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో 30 రోజులను కమలహాసన్ డేట్ల కేటాయించినట్లు తెలుస్తోంది. తన షూటింగ్ను కంప్లీట్ చేసుకుని విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా చిత్ర బృందం నుంచి క్లారిటీగా రాలేదు.

ప్రాజెక్ట్-K సినిమా కోసం కమలహాసన్ దాదాపుగా రూ .60 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వని దత్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నది. మరి కమలహాసన్ పై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.