నాగార్జునతో అనుష్క బంధం అక్కడ మొదలయ్యిందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా 10 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు కూడా అడపా దడపా సినిమాలలో నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటికీ అనుష్క వివాహం చేసుకోకపోవడంతో ఈమె పైన పలు రకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. మొదట అనుష్క శెట్టి సూపర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా హీరోగా నాగార్జున నటించారు.

When Nagarjuna Akkineni REACTED to rumours of him dating Anushka Shetty |  PINKVILLA
ఇక అప్పటినుంచి నాగార్జున ,అనుష్క బంధం మొదలైందని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు వీరిద్దరి మీద పలు రూమర్లు కూడా వినిపిస్తూనే ఉండేవి. అనుష్క, నాగార్జున కలిసి పలు చిత్రాలలో కూడా నటించడం జరిగింది. కానీ నాగార్జున కుమారులు మాత్రం అనుష్క మా కుటుంబానికి మంచి స్నేహితురాలు అని తెలియజేస్తూనే ఉంటారు.

Anushka Asking Nagarjuna To Propose Her || Super Movie || Nagarjuna, Ayesha  Takia, Anushka - YouTube
అనుష్క అసలు పేరు స్వీటీ.. అయితే ఈమె తల్లిదండ్రులు కూడా ఈమెకు స్వీటీ అనే పేరుని నామకరణం చేశారు. సూపర్ సినిమా షూటింగ్ సమయంలో అనుష్కని నాగార్జున నీ పేరేంటి అని అడగగా ఆమె స్వీటీ అని తెలియజేసిందట.. నాగార్జునకు డౌట్ వచ్చి ఆమె పాస్పోర్ట్ కూడా చూశారట అందులో కూడా తన పేరు స్వీటీ అని ఉండడంతో ఒక హీరోయిన్ కి ఇలాంటి పేరు సెట్ అవ్వదని తెలిసి తనకు ఒక మంచి పేరు పెట్టాలని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో తెలిపారట. ఆ సమయంలోనే అక్కడే ఒక సింగర్ పేరు అనుష్క అని తెలుసుకున్న నాగార్జున ఆమెకు అనుష్క అనే పేరుని పెట్టడం జరిగిందట. అప్పటివరకు ఆ పేరుతో ఇండస్ట్రీలో ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు..దీంతో స్వీటీ కాస్త అనుష్క గా మారింది..అప్పటినుంచి నాగార్జున అనుష్క మధ్య మంచి బంధం ఏర్పడింది. ఈ విషయాన్ని ఒక ఈవెంట్లో పూరి జగన్నాద్ తెలియజేశారు.