హాట్ టాపిక్ గా మారుతున్న బాలయ్య రెమ్యూనరేషన్..!!

చాలా కాలం పాటు వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ బాలయ్య బాబు రెండేళ్ల గా వరుస ప్లాట్లతో సతమతమవుతున్న బాలయ్య..అఖండ, గానే వీరసింహారెడ్డి వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు బాలయ్య. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఏజ్ తో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో సినిమాలు మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు బాలయ్య.

Pulivarthi Karthik on Twitter: "Happy birthday to our balaya babu jai balaya  #HappyBirthdayNBK #Akhanda https://t.co/awajIcGwrw" / Twitter
ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బాబి తో మరొక సినిమాని తెరకెక్కించబోతున్నారు బాలయ్య. వరుస చిత్రాలతో సత్తా చాటుతున్న బాలయ్య ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి.. బాలయ్య వరుస హిట్లు కొట్టడంతో డైరెక్టర్ బాబీ సినిమాకి బాలయ్య రెమ్యూనరేషన్ రూ .25 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. వాస్తవానికి బాలయ్య అఖండ చిత్రానికి కేవలం రూ.10 కోట్ల రూపాయలు అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి చిత్రానికి రూ.15 కోట్లు తీసుకోగా ఇప్పుడు అనిల్ రావు పూడి భవంత్ కేసరి చిత్రానికి ఇదే లెవెల్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

డైరెక్టర్ బాబీతో చిత్రానికి రూ .25 కోట్ల రూపాయలు పెంచారని టాక్ వినిపిస్తోంది.. ఇదంతా ఇలా ఉండగా టాలీవుడ్లో సీనియర్ హీరోల లిస్టులో చిరంజీవి మాత్రమే ఒక్క చిత్రానికి రూ .50 కోట్లు అందుకుంటున్నారు. ఆ తర్వాత వెంకటేష్ రూ .12 కోట్లు నాగార్జున రూ .10 కోట్లు ఇప్పుడు బాలయ్య రూ .25 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.