అనుప‌మ‌కు అంత పొగ‌రా.. అందుకే స్టార్ హీరోలు ఆమె వంక చూడ‌ట్లేదా?

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీస్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకటి. అయితే అందం, అభినయం, అంతకుమించిన నటన ప్రతిభ ఉన్న అనుప‌మ‌కు స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు మాత్రం రావడం లేదు. పైగా గ‌త తేడాది అనుపమ వరుస విజయాలతో కెరీర్‌ పరంగా య‌మా జోరు చూపించింది. ఈ బ్యూటీ నటించిన కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలు మంచి విజయం సాధించాయి.

అయినా సరే అనుపమ వంక టాలీవుడ్ టాప్ హీరోలు క‌న్నెత్తి కూడా చూడ‌ట్లేదు. అయితే ఇందుకు కారణం ఆమెకు ఉన్న పొగరే అని టాక్‌ నడుస్తోంది. నిజానికి అనుపమ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుందట. ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్పేస్తుందట. ఎదుటివారు ఏమనుకుంటారు.. ఎలా ఫీలవుతారు అనేవి ఆమె అస్సలు ఆలోచించదట. ఈమె బిహేవియర్ వల్ల కొందరు యంగ్‌ హీరోలు, డైరెక్ట‌ర్లు కూడా ఇబ్బంది పడ్డారట. ఈ క్రమంలోనే అనుప‌మ‌కు బాగా పొగరు అన్న టాక్ వచ్చేసిందట.

అందుకే స్టార్ హీరోలు ఆమెతో నటించేందుకు పెద్దగా ఇష్టపడరని గుసగుస‌లు వినిపిస్తున్నాయి. అయితే అనుప‌మ వెర్ష‌న్ మాత్రం మ‌రోలా ఉంది. తాజాగా ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. `భావోద్వేగాలకు వ్యక్తపరిచే విషయంలో నేను చాలా నిజాయితీగా ఉంటాను. నాకు ఏదైనా నచ్చకపోతే ముఖం మీద చెప్పేస్తా. ఎందుకంటే మన లైఫ్ చాలా చిన్నది. ఇక్కడ కొన్నేళ్లు ఉండేందుకు వచ్చాం.. మళ్లీ వెళ్ళిపోతాం. ఆరోజు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. బతికి ఉన్న కొద్ది రోజులైనా ఒత్తిడి దాచుకోవడానికి మన శక్తిని ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయాలి. అందుకే ఏదైనా న‌చ్చ‌క‌పోతే వెంట‌నే చెప్పేస్తా. అది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌చిపోతా` అంటూ చెప్పుకొచ్చింది.