ఆ ఒక్క కార‌ణంతో ప‌విత్ర లోకేష్ హీరోయిన్ కాలేక‌పోయిందా.. దుర‌దృష్టం అంటే ఇదే!

ప‌విత్ర లోకేష్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. మైసూర్ లో జ‌న్మించిన ప‌విత్ర‌.. క‌న్న‌డ న‌టుడు లోకేష్ కుమార్తె. తండ్రి అండదండ‌ల‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ప‌విత్ర‌.. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ కి జోడీగా `మిస్టర్ అభిషేక్` సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత బంగారద కలశలో న‌టించింది.

కానీ, ఇవేమి ఆమెకు స‌క్సెస్ ఇవ్వ‌లేదు. దాంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారింది. క‌న్న‌డ‌లో దాదాపు 150కి పైగా చిత్రాల్లో న‌టించింది. టాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. అనేక చిత్రాల్లో త‌ల్లిగా, వ‌దిన‌గా, అక్క‌గా వివిధ పాత్ర‌ల‌ను పోషించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక న‌టుడు న‌రేష్ తో రిలేష‌న్ మొద‌లు పెట్టాక ప‌విత్ర మ‌రింత పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం న‌రేష్ తో స‌హ‌జీవ‌నం చేస్తున్న ప‌విత్ర‌.. త్వ‌ర‌లోనే ఆయ‌న‌తో పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతోంది.

అయితే హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని అందం ప‌విత్ర సొంతం. అయినాస‌రే ఆమె హీరోయిన్ గా స‌క్సెస్ కాలేక‌పోయింది.. అందుకు కార‌ణం ఆమె హైట్ అని అంటుంటారు. కన్నడ ఇండస్ట్రీలో ప‌విత్ర హీరోయిన్ గా పరిచయం అయ్యే సమయానికి స్టార్ హీరోలుగా ఉన్న అందరూ హైట్ లో ఆమె కంటే తక్కువగా ఉండేవారు. 5.10 అడుగులు ఎత్తు ఉండే పవిత్ర లోకేష్ ముందు హీరోలు అస్సలు సెట్ అయ్యేవారు కాదు. దాంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమ‌ను మీరోయిన్ గా తీసుకునేందుకు వెనక‌డుగు వేసేవారు. ఇక చేసేదేమి లేక ప‌విత్ర క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారింది.