NTR -30 లో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..?

RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరగడమే కాకుండా తన తదుపరిచిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించాలని చూస్తూనే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా అని డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో అంతకుమించి అనిపించేలా పాత్ర ఉండబోతున్నట్లు కొరటాల శివ ఈ సినిమా ఓపెనింగ్ సమయంలో తెలియజేయడం జరిగింది. ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని పాత్ర మిస్మరైజ్ చేసే విధంగా ఉంటుందని తెలిపారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక విషయం వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న నటి “మని చందన” నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె గతంలో మహేష్ ,పవన్ కళ్యాణ్ వంటి చిత్రాలలో కూడా నటించింది. తెలుగుతోపాటు కన్నడ మలయాళం వంటి సినిమాలలో కూడా నటించింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఈమె పాత్ర కీలకమే అన్నట్లుగా సమాచారం. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదటిసారిగా ఎంట్రీస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Manichandana Ayithi (@ManichandanaAy2) / Twitter
జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సినిమాతో దగ్గర అవ్వాలని తెలుగు ఆడియోస్ కు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెలుగులో సినిమాని ఓకే చెప్పినప్పటి నుంచి సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది. ఎన్టీఆర్ 30వ సినిమాలు చాలా ప్రత్యేకతలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు పొందారు. మరి అంచనాలను మించి ఎన్టీఆర్ అభిమానులను ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.