`పోకిరి` లాంటి ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్స్ ఎవ‌రో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్.. వ‌య‌సు యాభైకి చేరువ‌వుతున్న పాతికేళ్ల కుర్రాడిగా క‌నిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతున్నారు. ఇక‌పోతే మహేష్ నటించి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో `పోకిరి` ఒక‌టి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్ని క్రేజీ రికార్డ్స్ బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు లేదు.

 

2006లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించి ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీతోనే మ‌హేష్ బాబు స్టార్ హీరోగా నిల‌దొక్కుకున్నాడు. అయితే ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ ఆక‌ట్టుకుంది. కేవ‌లం న‌ట‌నతోనే కాకుండా నాజూకు న‌డుము మెరుపులతో కోట్లాదిమంది కుర్ర కారును ఆకర్షించింది. అయితే నిజానికి ఇలియానా పోకిరి మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ కాదు. ఇలియానా కంటే ముందు న‌లుగురు హీరోయిన్స్ ఈ మూవీని రిజెక్ట్ చేశారు.

`పోకిరి` లాంటి ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకున్న ఆ అన్ ల‌క్కీ హీరోయిన్స్ ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుంది. డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ మొద‌ట హీరోయిన్‌ పాత్ర కోసం కంగనా రనౌత్ ని సంప్రదించగా.. ఆమె వేరే ప్రాజెక్టులు బిజీగా ఉండి నో చేసిందట. ఆ తర్వాత దీపికా పదుకునే, పార్వతీ మెల్టన్, ఆయేషా టాకియాని వంటి హీరోయిన్స్ ను పెట్టుకుందామ‌ని అనుకోగా.. వారు కూడా పోకిరి మూవీని తిర‌స్క‌రించారు. ఫైన‌ల్ గా ఇలియానా హీరోయిన్ గా ఫిక్స్ అయింది.