Sr. ఎన్టీఆర్ -కృష్ణకు ఉన్న స్నేహబంధం గురించి చెప్పడానికి ఇది చాలదా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి ఈనెల 31వ తేదీ అందుకే ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన మోసగాళ్లకు మోసగాడు సినిమా అని రీ రిలీజ్ చేయబోతున్నారు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు.. అందుకు సంబంధించి కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే మోసగాళ్లకు మోసగాడు సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ని కూడా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు సినిమా సక్సెస్ గురించి ఆనాడు ఎన్టీఆర్ రాసిన ఒక లేఖను ఎన్టీఆర్ అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. ఈ పోస్టర్ తో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేకంగా సమర్పించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ లేఖలో నా సోదరుడు కృష్ణ తీసిన మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని చూడడం జరిగింది.. ఈ చిత్రాన్ని అద్భుతమైన సాంకేతిక విలువలతో నిర్మించారు.. తపన ప్రతిఫ్రేమ్ లో ప్రతి సీనులో స్పష్టంగా కనిపించింది..

తెలుగు భాషలో చూస్తున్న ఇంగ్లీష్ చిత్రంగా అనిపించింది ముఖ్యంగా చాయ గ్రహకుడు ప్రతిభ అమోఘమని చెప్పాలి.. అలాగే కథను అనూహ్యమైన వేగంగా రూపొందించిన దర్శకుడుకు కృతజ్ఞతలు..సాంకేతికత ఇలాంటి అందమైన కళాకాండాన్ని కృష్ణ అభిమానులకు మరిన్ని అందించాలని ఆశిస్తూ ఈ చిత్ర నిర్మాణ కృషిని అభినందిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ లేఖలో రాసుకొచ్చారు. ఎన్టీఆర్- కృష్ణ కూడా మంచి అనుబంధం ఉండేది. అంతేకాకుండా ఎన్టీఆర్- కృష్ణ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగిన కచ్చితంగా మాట్లాడుకునే వారిని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కృష్ణ నటించే చిత్రాలను ఎన్టీఆర్ అభిమానించే వారిని సమాచారం. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉండేదని చెప్పవచ్చు. ఇక ఈ తరం కూడా మహేష్ బాబు- ఎన్టీఆర్ కూడా మంచి స్నేహితులుగానే ఉన్నారు.