పవిత్ర లోకేష్.. ప్రస్తుతం ఈమె తెలియని వారు ఉండరు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర లోకేష్.. నరేష్ తో రిలేషన్ మొదలుపెట్టాక మరింత పాపులర్ అయింది. దాదాపు నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తూ టాలీవుడ్ లో సెన్సేషన్ కపుల్ గా మారిన నరేష్, పవిత్ర జంటగా `మళ్లీ పెళ్లి` అంటూ సినిమా కూడా తీశారు.
నేడు ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో అట్టహాసంగా విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, పవిత్ర చేసిన హంగామా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం నరేష్ తో పాటు పవిత్ర పేరు మారుమోగిపోతోంది. అలాగే ఆమెకు ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. అయితే పవిత్ర తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడుతుంది. ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిందట.
ఇంతకుముందు ఒక్క రోజుకు రూ. 50 వేల రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకున్న పవిత్ర లోకేష్.. ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తుందట. అంటే పది రోజులు షూటింగ్ లో పాల్గొంటే పది లక్షలు ఆమెకు ముట్టజెప్పాలన్నమాట. ఒక్కసారిగా పవిత్ర లోకేష్ తన రెమ్యునరేషన్ పెంచడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారట. అయినా సరే ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు వెనకడుగు వేయడం లేదని టాక్ నడుస్తోంది.