భర్తకు విడాకులిస్తున్న బుల్లితెర నటి మహాలక్ష్మీ.. క్లారిటీ ఇదిగో!

తమిళ బుల్లితెర నటి మహాలక్ష్మీ గురించి తెలిసే ఉంటుంది. మనవాళ్ళకి తెలిసే అవకాశం ఉండేది కాదేమో గానీ, పెళ్లి విషయంలో మహాలక్ష్మీ ఏకంగా ఇండియాలోనే టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అవును, ప్రొడ్యూసర్ రవీందర్ చంద్రశేఖరన్ ను ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో విషయం మీడియాకు ఎక్కింది. దానికి కారణం ఒకే ఒక్కటి. మహాలక్ష్మీ చూడటానికి చాలా స్లిమ్ గా, అందంగా ఉంటే రవీందర్ చూడడానికి చాలా లావుగా ఉంటాడు… అంటే ఊబకాయుడు. ఈ క్రమంలో రవీందర్ దగ్గర ఉన్న డబ్బును చూసే ఆమె పెండ్లి చేసుకుందంటూ అప్పట్లో చాలామంది విమర్శించారు కూడా.

విషయం ఆ పెరుమాళ్ళకెరుకగానీ, ఇపుడు వీరిద్దరూ విడిపోతారు అంటూ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జంట పెండ్లి అయిన మొదట్లో రొమాంటిక్ ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్టు చేసేవారు. కానీ కొంత కాలంగా ఎలాంటి పోస్టులు చేయట్లేదు. దాంతో ఇద్దరూ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇన్ని రోజులు వీరు ఆ వార్తలపై స్పందించకపోవడంతో వాటికి మరింత బలం పెరిగింది. అయితే తాజాగా వాటిపై స్పందించిన మహాలక్ష్మీ అలాంటిదేం లేదని తెలిపింది.

అవును, అదే నిజమని అనిపిస్తోంది. ఎందుకంటే మహాలక్ష్మీ తాజాగా సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ… “నువ్వు నా భుజంపై చేయివేస్తే నేను ప్రపచంలో దేన్నైనా గెలవగలను అనే నమ్మకం వస్తుంది. ఐ లవ్ యూ అమ్ము!” అంటూ తన భర్తపై ఉన్న ప్రేమను ప్రకటించింది. ఇక ఆమె భర్త రవీందర్ కూడా ఆ ఫొటోకు ‘లవ్ యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో వీరిద్దరి విడాకుల విషయం అబద్ధమని తేలిపోయింది.

Share post:

Latest