ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. `ఆదిపురుష్` రిలీజ్ రోజే మ‌రో బిగ్ స‌ర్‌ప్రైజ్‌!?

వ‌చ్చే నెల‌లో ప్ర‌భాస్ న‌టించిన తొలి పౌరాణిక చిత్రం `ఆదిపురుష్` విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రైత్ రూపొందించిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా న‌టించారు. జూన్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మేక‌ర్స్ మ‌రింత హైప్ పెంచుతున్నారు. ప్ర‌భాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూలు, ప్రెస్ మీట్స్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాయి. అయితే తాజాగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ బ‌య‌టకు వ‌చ్చింది. అదేంటంటే.. ఆదిపురుష్ రిలీజ్ రోజే మ‌రో బిగ్ స‌ర్‌ప్రైజ్ రాబోతోంది.

ఇంత‌కీ ఆ స‌ర్‌ప్రైజ్ మ‌రేంటో కాదు `స‌లార్` టీజ‌ర్‌. ప్ర‌శాంత్ నీల్, ప్ర‌భాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్‌. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. అయితే ఆదిపురుష్ విడుద‌ల రోజే స‌లార్ టీజ‌ర్ ను వ‌దిలేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఆదిపురుష్ రిలీజ్ అవుతోన్న అన్ని థియేట‌ర్స్‌లో స‌లార్ టీజ‌ర్ స్క్రీనింగ్ ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై ఆఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని కూడా టాక్ న‌డుస్తోంది.

Share post:

Latest