అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ అనతికాలంలోనే పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్ కలిగివుండడంతో సినిమా అవకాశాలు కూడా మెండుగా వస్తున్నాయి. కాకపోతే సినిమాల పరంగా అనుకున్న బ్రేక్ మాత్రం ఆమెకి రావడం లేదు. ఇక ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.
ఇక అసలు విషయంలోకి వెళితే, తాజాగా ఈమె నడిసంద్రాన వైట్ కలర్ డ్రెస్‌లో మెరుస్తూ అభిమానులను కనువిందు చేసింది. తాజాగా దానికి సంబందించిన ఫోటోలు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. దాంతో కుర్రకారు ఆ ఫోటోలను పదే పదే చూస్తున్న పరిస్థితి. కనీకనిపించని ఆమె పరువాల విందుకి కుర్రాళ్ళు చిత్తు చిత్తు అయిపోతున్నారు. ఇకపోతే తెలుగులో ఎప్పటి నుంచో ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన జాన్వీకపూర్.. ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో స్టార్ హీరో సినిమాకు సైన్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించడం ఖాయం అని తెలుస్తోంది. ఇదే విషయమై ఆ మధ్య ఆమె తండ్రి బోనీ కపూర్ ఓ ప్రకటన చేసిన సంగతి విదితమే. దానికి తగ్గట్టుగానే వరుసగా ఆమె తెలుగు సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. కాగా జాన్వీ కపూర్ ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి. తాజాగా ఈ బీచ్ ఫోటోలు రచ్చ రచ్చ చేస్తుండడం కొసమెరుపు.