నరేష్ – పవిత్రను ఆపే హక్కు ఎవరికీ లేదు: కార్తీకదీపం నటి

ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా వినబడుతున్న జంట ఏదైనా వుంది అంటే, అది నరేష్ – పవిత్ర లోకేష్ ల జంటే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు నరేష్ , పవిత్ర లోకేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే, ఈ సినిమా సంగతి పక్కన బెడితే గత కొంత కాలంగా వీరిద్దరి జీవితాలు మీడియా చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వీరిద్దరూ బెంగళూరులోని ఒక హోటల్ గదిలో అడ్డంగా దొరికిపోయారో.. అప్పటినుంచి వీరు టాక్ అఫ్ ది టౌన్ అయ్యారు.

అంతవరకూ గుట్టుగా సాగిపోతున్న వీరి జీవితాలు ఒక్కసారిగా బట్టబయలు అయ్యాయి. దానికి కారణం నరేష్ రెండవ భార్య రమ్య రఘుపతి. అవును, ఆమెకి విడాకులివ్వకుండానే నరేష్ పవిత్రతో ఘనకార్యాలు నెరపడంతో విషయం రచ్చకెక్కింది. ఇక అది చాలదన్నట్టు వారి జీవితంలో జరిగే విషయాలపైనే వారు మళ్లీ పెళ్లి సినిమా అంటూ ప్రేక్షకుల ముందుకు రావడంతో మీడియా సంస్థలన్నీ వారిపైనే ఫోకస్ పెట్టాయి. ఇక వీరిద్దరూ ఈ సినిమా ప్రమోషన్స్ లో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడబడితే అక్కడ ముద్దులు పెట్టుకోవడాలు, రొమాన్స్ చేసుకోవడం షరా మామ్మూలే అయిపోయింది.

ఈ క్రమంలో, సోషల్ మీడియాలో వారిపైన తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసినదే. కాగా ఈ విషయంలో వారికి ఆసరాగా నిలించింది కార్తీక దీపం నటి సౌందర్యం. తాజాగా ఆమె నరేష్ పవిత్ర లోకేష్ ల రిలేషన్షిప్ ని సమర్థిస్తూ ఆసక్తికరమైన కామెంట్లను చేసింది. “నరేష్, పవిత్ర ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఎవరి ఇష్టం వాళ్ళది.. ఒక పర్సన్ మీద ఒకరికి ఇంట్రెస్ట్ కలగడం అనేది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయం. ఆ విషయంలో ఆఖరికి అమ్మానాన్నలకు కూడా సంబంధం ఉండదు. అలాంటిది వాళ్లపై మీ ఎదవ కామెంట్లు ఏమిటి?” అంటూ ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చింది. ఇక దీనిపై మీ స్పందనేమిటి?

Share post:

Latest