అఫీషియల్ అప్డేట్: SSMB28 ఫైనల్ టైటిల్ వచ్చేసిందోచ్.. అదే సెంటిమెంట్ రిపీట్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు. “అతడు” లాంటి మరో క్రేజీ ఫ్యామిలీ హిట్ కోసం వెయిట్ చేస్తున్న మహేష్ బాబుకు ఇది పర్ఫెక్ట్ సినిమా స్టోరీ అంటున్నారు మహేష్ బాబు అభిమానులు .

కాగా ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు .. “అ” అనే తన సెంటిమెంట్ను రిపీట్ చేయబోతున్నాడు అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే రీసెంట్గా సినిమా టైటిల్ ని ఫైనలైజ్ చేస్తూ ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. మే 31న మహేశ్ బాబు నాన్న గారు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ చేయబోతున్నట్లు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది .

ఈ క్రమంలోనే” అమరావతికి అటు ఇటు ” అనే టైటిల్ ని ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయట . ఈ సినిమాలో మహేష్ బాబు టోటల్ ఫ్యామిలీ లుక్ లో కనిపించబోతున్నారు అని ..మరో “అతడు” లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా తన ఖాతాలో వేసుకోవడం పక్క అంటున్నారు ఫ్యాన్స్..చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక పరిస్ధితి ఎలా ఉండబోతుందో..?

 

Share post:

Latest