పుష్ప-2 చిత్రంలో మెగా డాటర్.. నిజమేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పుష్ప -2 ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ భారీ బడ్జెట్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కావడంతో సీక్వెల్ పైన మరింత దృష్టి పెట్టారు. ఇందులో రష్మిక అనసూయ సునీల్ తదితర నటీనటుల సైతం ఎంతో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా పాహాద్ ఫాజిల్ పోలీస్ పాత్రలో అదరగొట్టేశారు.

Niharika speaks about 'RRR', 'Bheemla Nayak', 'Pushpa' - Tamil News -  IndiaGlitz.com

పుష్ప మొదటి భాగం కంటే రెండో భాగాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ షూటింగ్ను కూడా శరవేగంగా చేస్తూ ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే ఈ సినిమా నుంచి ఏదో ఒక వార్త వైరల్ గా మారుతూనే ఉంది. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒక గ్లింప్స్ విడుదల చేయగ మరింత హైప్ ని పెంచడంతోపాటు వైరల్ గా మారింది. అయితే ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం నిహారిక కొనిదెల నటించబోతోందని వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ పాత్రకు చాలా ఇంపార్టెంట్ ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Pushpa 2 Twist revealed.. It happened as expected.. He is the next 'Pushpa'!

మరి నిహారిక పై వస్తున్న ఈ వార్తలపై చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. నిహారిక కూడా గత కొద్దిరోజుల క్రితం నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతోంది అంటూ తిరిగి మళ్ళీ సినిమాలలో నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తను ఒక ప్రొడక్షన్ హౌస్ ని కూడా నిర్మించింది. మరి ఈసారైనా సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి నీహారిక.

Share post:

Latest