మనిషి అన్నాక ఎమోషన్స్ కామన్.. ప్రేమ – భయం – ద్వేషం – కోపం అన్ని ఫీలింగ్స్ కలగల్సి ఉంటేనే అతన్ని మనిషి అంటారు. కాగా ఎంతటి పెద్ద స్టార్ హీరో అయిన ..స్టార్ డైరెక్టర్ అయిన సరే వాళ్ళకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు పర్సనల్ లైఫ్ ఉంటుంది. పైకి పెద్ద స్టార్ హీరోగా ఉన్నంత మాత్రాన అతగాడు దేవుడితో సమానం అంటూ భావించకూడదు. మనలాగే ప్రేమ.. ఇష్టాలు..భయం కోపాలు అన్ని ఉంటాయి.
కాగా రీసెంట్‌గా సోషల్ మీడియాలో దర్శకధీరుడు రాజమౌళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ మేటర్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే అంతటి పెద్ద స్టార్ డైరెక్టర్ ఇంత చిన్న విషయానికి భయపడతాడా షాకింగ్ గా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ సినిమాతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్‌ను పెంచుకున్నాడు. మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఇలా ప్రపంచవ్యాతంగా ఇంత గుర్తింపు తెచ్చుకున్నా రాజమౌళి చిన్న పాము ని చూస్తే వణికి పోతాడట. అదేంటో తెలియదు చిన్నప్పటినుంచి ఆయనకి పాము అంటే భయమట. ఆశ్చర్యమేంటంటే ఇప్పటికీ ఆయన పామును చూస్తే గజగజ వణికిపోతూ ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నే ఉన్నాయి. ఈ విషయం కారణంగా ఎన్నోసార్లు ఎన్టీఆర్, రాజమౌళిని ఆటపట్టించాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.