70 దేశాల్లో ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్.. గ్లోబల్ ఈవెంట్.!

తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథాలజికల్ యాక్షన్ మూవీ ఆది పురుష్.. ఈ సినిమా ట్రైలర్ ఈనెల తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ గురించి అధికారికంగా ఈరోజు ప్రకటించారు. ముఖ్యంగా ట్రైలర్ తేదీని ప్రకటిస్తూ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేయడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.. ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకాశం వైపు విల్లును ఎక్కుపెట్టిన రాఘవుడిగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మేకర్స్. జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Adipurush (2023) - IMDb

ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ను భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు భారీగా ప్లాన్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఒక్క ఇండియాలోనే కాకుండా ఏకంగా 70 దేశాల్లో ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.. సినీ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో మొదటిసారి ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ ను గ్లోబల్ ఈవెంట్ గా మార్చనున్నారు.. ఈ విషయాన్ని తాజాగా బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం గమనార్హం.

ఏది ఏమైనా ఇలా ట్రైలర్ను ఏకంగా 70 దేశాల్లో లాంచ్ చేస్తూ ఉండడం నిజంగా ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయమని చెప్పాలి. ఇకపోతే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఇప్పుడు రామాయణం ఆధారంగా ఆది పురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమా ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టిస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest