శ్రీలీల ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

ప్రముఖ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజతో ఈ అమ్మడు నటించిన ‘ధమాకా ‘ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దాంతో శ్రీలీలకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలో శ్రీలీల నటిస్తుంది. శ్రీలీల క్రేజ్ చూసి మిగతా హీరోయిన్లు టెన్షన్ పడుతున్నారు. వరుస ప్రాజెక్ట్స్ వల్ల శ్రీలీల ఇంట్లో కంటే ఎక్కువగా సెట్స్ లోనే గడుపుతుందట. మరో మూడు సంవత్సరాల వరకూ శ్రీలీల కెరీర్‌లో వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. రాబోయే మూడు సంవత్సరాల వరకూ శ్రీలీల స్టార్ హీరోలకు తప్ప మిగితా హీరోలకు అవకాశం ఇచ్చేలా లేదు. అవకాశం వచ్చినప్పుడే చేతినిండా సంపాదిస్తుంది ఈ బ్యూటీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న NBK108లో నటించడానికి శ్రీలీల రూ. 80 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

ఇక కొత్త సినిమాలకైతే ఏకంగా రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకోబోతుందని ఇండస్ట్రీవర్గాల నుంచి సమాచారం. అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివిని బట్టి ఆ రెమ్యూనరేషన్ లో మార్పులు ఉంటాయని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే శ్రీలీల మరో 5 ఏళ్ల పాటు బిజీ కెరీర్ ను కొనసాగించి అవకాశం ఉంది. ఈ అమ్మడు సీనియర్ స్టార్ హీరోలతో కూడా నటించడానికి ఓకే చెప్పేస్తుంది. ఇదంతా చూసిన శ్రీలిల అభిమానులు ‘శ్రీలీల కేరిర్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని మంచి కథలను ఎంచుకుంటే, ఆమెకి తిరుగుండదు’ అని సలహా ఇస్తున్నారు. రోజురోజుకీ శ్రీలీలకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.