లీకైన `సైంధవ్` స్టోరీ.. వెంక‌టేష్ పెద్ద ప్ర‌యోగ‌మే చేస్తున్నాడుగా!?

రీసెంట్ గా `రానా నాయుడు` వెబ్ సిరీస్ తో సంచ‌ల‌నం రేపిన విక్ట‌రీ వెంకటేష్ ప్ర‌స్తుతం `సైంధ‌వ్‌` అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రం చేస్తున్నాడు. హిట్‌, హిట్ 2 చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు శైలేష్ కొలను ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోంది.

అలాగే బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహాని శర్మ, యాండ్రియా జరేమియా, త‌మిళ హీరో ఆర్య‌ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే తాజాగా సైంధ‌వ్ స్టోరీ లీకైంది.

ఇదొక బ్లాక్ మ్యూజిక్ కాన్సెప్ట్ అట. అంటే చేతబడి అంశాన్ని ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ట‌. కర్ణాటక లో ఇలాంటివి చాలా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. వీటిని అరికట్టడానికి అక్కడి ప్రభుత్వం దేశంలో ఎక్క‌డా లేని ‘బ్లాక్ మ్యాజిక్ యాక్ట్’ ని కూడా ప్రవేశ పెట్టింది. ఈ యాక్ట్ కింద అక్క‌డ ప్ర‌తి రోజు ఎన్నో కేసులు న‌మోదు అవుతుంటాయి. అయితే కర్ణాటక బ్యాక్‌డ్రాప్ లో బ్లాక్ మ్యాజిక్ పాయింట్‌కి సైన్స్ ఫిక్స్, మెడికల్‌ మాఫియా అంశాలను జోడించి స‌స్పెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా సైంధ‌వ్ ను రూపొందిస్తున్న‌ట్లు లీకులు వ‌స్తున్నాయి. ఇది నిజ‌మైతే వెంక‌టేష్ పెద్ద ప్ర‌యోగ‌మే చేస్తున్న‌ట్లు అవుతుంది.