`ఉగ్రం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. అల్ల‌రోడికి ఇది పెద్ద షాకే!

`నాంది` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం అల్ల‌రి న‌రేష్‌, డైరెక్ట‌ర్ విజయ్ కనకమేడల కాంబినేష‌న్ లో వ‌చ్చిన మ‌రో చిత్రం `ఉగ్రం`. ఇందులో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మిర్నా మీనన్ హీరోయిన్ గా న‌టిస్తే.. ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, బేబీ ఊహ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ బ్యాన‌ర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.

భారీ అంచ‌నాల మే 5న విడుద‌లైన ఈ చిత్రానికి ఎబో యావ‌రేజ్ టాక్ ల‌భించింది. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ఈ సినిమా అందుకోలేక‌పోయింది. అయితే పవర్ ఫుల్ పోలీసోడుగా అల్లరోడి యాక్టింగ్ అదుర్స్. యాక్షన్ సీక్వెన్స్ లో ఇరగదీశాడు. సినిమా అంతా తానే కనిపించి వన్ మ్యాన్ షో చేశాడు. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా క్రైమ్‌ మిస్టరీలు ఇష్టపడేవాళ్లకి ఈ సినిమా కాలక్షేపంగా ఉంటుంది.

అయితే టాక్ అంతం మాత్రంగా రావ‌డంతో పాటు పోటీగా గోపీచంద్ రామ‌బాణం ఉండ‌టంతో.. క‌లెక్ష‌న్స్ పరంగా తొలిరోజు అల్ల‌రోడికి పెద్ద షాకే తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో కేవ‌లం రూ. 61 ల‌క్ష‌ల రేంజ్ లో షేర్‌ను రాబ‌ట్టిన ఉగ్రం.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 73 ల‌క్ష‌ల‌తో స‌రిపెట్టుకుంది. ఇక ఏరియాల వారీగా ఉగ్రం ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నిజాం: 23 ల‌క్ష‌లు
సీడెడ్: 10 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 7 ల‌క్ష‌లు
తూర్పు: 5 ల‌క్ష‌లు
పశ్చిమ: 3 ల‌క్ష‌లు
గుంటూరు: 5 ల‌క్ష‌లు
కృష్ణ: 5 ల‌క్ష‌లు
నెల్లూరు: 3 ల‌క్ష‌లు
———————————————
ఏపీ+తెలంగాణ మొత్తం= 0.61కోట్లు(1.15కోట్లు~ గ్రాస్‌)
———————————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా+ఓవ‌ర్సీస్‌: 12 ల‌క్ష‌లు
————————————————–
మొత్తం వ‌ర‌ల్డ్ వైడ్‌ కలెక్షన్‌= 0.73కోట్లు(1.45కోట్లు~ గ్రాస్)
————————————————–

కాగా, రూ. 6.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఉగ్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే మొద‌టి రోజు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 5.77 కోట్ల షేర్‌ను అందుకోవాల్సి ఉంటుంది.