చాలామంది హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. వారిలో కొందరు మాత్రమే స్టార్ హీరోయిన్లుగా నిలదుక్కుకుంటారు. అయితే చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా కేవలం ఒక దశాబ్దం పాటు కొనసాగుతూనే ఎక్కువ. ఎందుకంటే హీరోలు ఎన్ని సంవత్సరాలైనా ఇండస్ట్రీలో ఉంటారు.. కానీ హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ సమయం ఉంటుంది. ఇక వారు తమ అందచందాలతో పాటు నటనతో కూడా అభిమానులను మెప్పిస్తేనే ఎక్కువ కాలం నిలవగలరు.
లేకపోతే అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ నుంచి దూరమవుతారు. అలాంటి హీరోయిన్లు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. అసలు విషయానికి వస్తే.. తాజాగా హీరోయిన్ మెహ్రిన్ గురించి షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయానికి వెళ్తే మెహ్రిన్ అంటే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈమె చేసింది అతి తక్కువ సినిమాలే అయినప్పటికీ టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.
పంజాబీ ముద్దుగుమ్మయిన మెహ్రిన్ చీర కడితే అచ్చం తెలుగు అమ్మాయిలాగా తన సోయగాలతో కుర్రకారుని ఉర్రూతలుగిస్తుంది. ఇక నాని హీరోగా వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. గత సంవత్సరం వచ్చిన ఎఫ్3 సినిమా తర్వాత మళ్లీ మెహ్రీన్ టాలీవుడ్ లో కనిపించలేదు.
అయితే మెహ్రీన్ కాస్త లావుగా మరడంతో ఆమెకు అవకాశాలు రావటం లేదు అంటూ కొత్త వార్త బయటకు వచ్చింది. అయితే తాజాగా మెహ్రీన్ ని చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మెహ్రీన్ రీసెంట్ ఫోటోలు చూసినవారు ఇలా తయారయిందేంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు. మెహ్రీన్ చూడడానికి చాలా సన్నగా అసలు ఏంటి ? ఇలా మారిపోయింది అనేలా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఆమె ఫోటోలు చూసి చాలామంది అంత లావుగా ఉండే మెహ్రీన్ ఇంత తొందరగా సన్నగా ఎలా మారిపోయింది..మెహ్రీన్ ఏదైనా అరుదైన వ్యాధితో బాధ పడుతుందా ? అంటూ ఇలా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ మెహ్రీన్ అవకాశాల కోసం సన్నగా మారిపోయింది అని మరికోంత మంది భావిస్తున్నారు. మరీ ఫ్యూచర్లో మెహ్రీన్ ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి.