బేబీ బంప్ తో ఇలియానా.. యాంగిల్స్ మారుస్తూ కిర్రాక్ పోజులు!

గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఇలియానా.. ఇటీవల తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి అంద‌రికీ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఇలియానా ప్రెగ్నెంట్ అని ప్రకటించగానే చాలా మంది ఆమెపై విమర్శలు కురిపించారు.

అలాగే `నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు..?` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. కానీ, ఇలియానా నోరు మెదపలేదు. విమ‌ర్శ‌ల‌ను కూడా చాలా లైట్ తీసుకున్న ఆమె.. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ జ‌ర్నీని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ తో వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా బేబీ బంప్ ను ప్రదర్శించింది. మిర్ర‌ర్ ముందు నిల‌బ‌డి యాంగిల్స్ మారుస్తూ కిర్రాక్‌గా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, గతంలో ఓ ఆస్ట్రేలియన్ కొరియోగ్రాఫర్ తో కొన్నాళ్లు పాటు సహజీవనం చేసిన ఇలియానా.. ఆ త‌ర్వాత అత‌డికి బ్రేకప్ చెప్పేసింది. ఇక ఇటీవ‌ల కత్రినాకైఫ్‌ సోదరుడు స్టెబాస్టిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్త‌లు వ‌చ్చాయి.

Share post:

Latest