గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ కీర్తి సురేష్.. ఏమిటంటే..?

సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్.. తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. కానీ గత కొద్దిరోజులుగా వివాహం చేసుకోబోతోంది అంటూ పలు రూమర్లైతే వినిపించాయి ఈ వార్తలన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది కీర్తి సురేష్.

చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. కీర్తి సురేష్ తండ్రి కూడా మలయాళంలో ఒక బడ నిర్మాత ఈమె తల్లి కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కావడం చేత ఇండస్ట్రీలోకి కీర్తి సురేష్ ఎంట్రీ చాలా సులువుగా వచ్చింది.ఈమె అక్క రేవతి సురేష్ కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది.. ఈమె దర్శకురాలుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టడం విశేషమని చెప్పవచ్చు. మలయాళంలో థాంక్యూ అనే ఒక షార్ట్ ఫిలిం చేసింది కీర్తి సురేష్ అక్క.. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ని కూడా లాంచ్ చేసింది కీర్తి సురేష్ .ప్రస్తుతం ఇప్పుడు అది వైరల్ గా మారుతోంది.

సురేష్ కుమార్ నితిన్ మోహన్ ఈ షార్ట్ ఫిలిం ని ప్రొడ్యూస్ చేస్తున్నారు పోస్టర్లు రెండు జతల చెప్పులను పెట్టారు అలాగే థాంక్యూ టైటిల్ తో టీ కప్ సింబల్ ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. కీర్తి సురేష్ ఒకవైపు గ్లామర్ రోల్స్ పాత్రలలో నటిస్తూ మరొకవైపు ప్రేక్షకులకు గుర్తుంది పోయే పాత్రలో నటిస్తూ బిజీగా ఉంటోంది. మరి కీర్తి సురేష్ అక్క కూడా డైరెక్టర్ గా సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.

Share post:

Latest