బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ మీడియా కంటపడ్డ ప్రముఖ నటి..!

ఇటీవల కాలంలో హీరోయిన్లు కొంతమంది తమ ప్రేమను బయటకి బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేస్తే మరి కొంతమంది బయట కలసి తిరుగుతున్నా..తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది అంటూ కొట్టి పారేస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా మరొక వెండితెర హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా కంట పడ్డాయి.. తమిళ్ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగువారికి కూడా సుపరిచితమైన ప్రియా భవాని శంకర్ చినబాబు, తిరు, ఏనుగు వంటి చిత్రాలలో ఇక్కడి వారిని బాగా అలరించింది.

Priya Bhavani Shankar - IMDb

తెలుగులో కళ్యాణం కమనీయం అనే సినిమాలో కూడా నటించింది. ఇక జయం రవి సరసన నటించిన అఖిలన్, శంభు సరసన పత్తుతల, లారెన్స్ తో రుద్రం వంటి సినిమాలు చేసి విజయం అందుకుంది. మరొకవైపు ఈమె చేతిలో పలు సినిమాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా షూటింగ్ దశలో ఉండగా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఏ విషయాన్నైనా ఓపెన్ గా చెప్పే ఈ అమ్మడు డబ్బుల కోసమే ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు అందాల ఆరబోత విషయాల్లో కూడా వెనుకాడడం లేదు.

ఇదిలా ఉండగా తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో ఓపెన్ గా చట్టపట్టలేసుకొని తిరుగుతూ కనిపించింది. రాజ్ వేల్ అనే వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నా.. ప్రేమలో ఉన్నామని చెబితే సినిమా అవకాశాలు రావని, ఫేమ్ తగ్గిపోతుందని భావిస్తున్న నేటి హీరోయిన్లు ఉన్న సినిమా పరిశ్రమలో ఆమె మాత్రం తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. తాజాగా అతనితో కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ.. అతడితో ముద్దు మురిపాల్లో తేలి ఆడింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest