టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్లుగా మారిన వారిలో రాశి కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్లుగా మారాక సక్సెస్ అయినా వాళ్ళు చాలా తక్కువ. కానీ రాశి మాత్రం అలా కాదు టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచి కథ ఉన్న సినిమాలనే ఎంచుకుంటు అవసరం అనుకున్నప్పుడు గ్లామర్ ఒలకబోయడానికి కూడా వెనకాడలేదు.
రాశి కెరీర్ పరంగా క్రేజీలో ఉన్నప్పుడే ఎవరికీ తెలియని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. రాజేంద్రప్రసాద్ హీరోగా ఒక పెళ్ళాం ముద్దు.. రెండో పెళ్ళాం వద్దు సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాకు రాశి భర్త శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక రోజు సాంగ్ షూట్ చేస్తుండగా అసోసియేట్‌గా ఉన్న శ్రీనివాస్ కేవలం రాశిని చూడాలన్న కుతూహలంగా ఆమె దగ్గరకు వెళ్లి ఓ సీన్ గురించి వివరిస్తున్నాడట.
పక్కనే ఉన్న కో డైరెక్టర్ ఇప్పుడు సాంగ్ షూట్ చేస్తుంటే నువ్వు డైలాగ్ ఎందుకు చెపుతున్నావని ప్రశ్నించాడట. అప్పటకి ఆమె ఓ స్టార్ హీరోయిన్. శ్రీనివాస్ ఎవరో ఎవ్వరికి తెలియదు. ఆ ఒక పెళ్లాం ముద్దు… రెండో పెళ్లాం వద్దు సినిమాలో రాజేంద్రప్రసాద్, రాశి, గుర్లీన్ చోప్రా నటిస్తున్నారు. ఆ రోజు రాశీ బ్లూ శారీతో ఉందని శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ టైంలో శ్రీనివాస్ నమస్తే మేడం అని ప్రతి రోజు రాశికి వినయంగా విష్ చేసేవాడట.
విచిత్రం ఏంటంటే శ్రీనివాస్ పట్ల ఆమెకు మంచి అభిప్రాయం ఏర్పడడం.. ప్రతి రోజు తనకు డైలాగ్ సీన్లు వివరిస్తున్నప్పుడు అతడి పట్ల ఇష్టం పెంచుకుని కేవలం 15 రోజుల్లోనే ప్రేమించానని ఆమే స్వయంగా చెప్పేసే వరకు వెళ్లిందట.అంటే 15 రోజుల్లోనే రాశి.. శ్రీనివాసన్ ప్రేమలో పడిపోయింది. అంత త్వరగా వీరి ప్రేమ నడిచింది. తాను అంత త్వరగా ప్రేమలో పడినప్పటకీ మా ప్రేమ బంధం ఎంతో బలమైనదని రాశి ఎప్పుడూ చెపుతూ ఉంటోంది. వీరి పెళ్లి జరిగి 17 సంవత్సరాలు అయ్యింది. ఇక రాశి పెళ్లి తర్వాత పలు బిజినెస్‌లు స్టార్ట్ చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.