నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా ఎన్బికె 108 అనే వర్కింగ్ టైటిల్ తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అని ప్రకటించినప్పటి నుంచి విపరీతమైన అంచనాలు కూడా పెరిగిపోయాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన పోస్టర్ కూడా సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.. వాస్తవానికి బాలయ్య బాబుకి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన అనిల్ రావిపూడి ముందు నుండి చెబుతున్నట్లుగానే ఎవరు ఊహించని విధంగా బాలయ్య బాబును చాలా సరికొత్తగా ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఇక ఈ ఏడాది దసరా బరిలో దిగడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్రబృందం షూటింగును సెరవేగంగా జరుపుకుంటుంది.
తాజాగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వేసిన భారీ సెట్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో బాలీవుడ్ నటుడు విలన్ గా నేషనల్ అవార్డు విన్నర్ అయిన అర్జున్ రాంపాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు తాజాగా ఇందులో ఆయనకు సంబంధించిన ఒక పోస్టర్ను రివీల్ చేస్తూ అర్జున్ రాంపాల్ కి ఎన్బికె 108 టీం వెల్కమ్ చెప్పింది. అంతేకాదు అనిల్ రావిపూడి అర్జున్ కలిసి ఒక చిన్న బిట్ వీడియోని కూడా రిలీజ్ చేయడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇకపోతే ఆ వీడియో బిట్ లో ఏముంది అంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి మెట్లపై కూర్చుని ఉంటాడు. అర్జున్ రాంపాల్ మెట్లు దిగుతూ వచ్చి అనిల్ పక్కన కూర్చుంటూ.. బాలయ్య బాబు డైలాగు చెబుతాడు.. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు అంటూ అర్జున్ రాంపాల్ డైలాగ్ కొట్టగానే దానికి అనిల్ రావిపూడి బాలయ్య బాబు డైలాగ్ అంటాడు మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు అర్జున్ రాంపాల్. మరొకవైపు పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు.