ఆ హీరో వల్లే నా కెరియర్ నాశనం అయ్యింది.. అమ్మ రాజశేఖర్..!!

ఇండస్ట్రీకి మొట్టమొదటిగా డాన్స్ మాస్టర్ గా పరిచయమై దర్శకుడిగా మారిన వాళ్లలో అమ్మ రాజశేఖర్ కూడ ఒకరు. ఈయన మాత్రమే కాదు ప్రభుదేవా, లారెన్స్ వారిద్దరూ కూడా డైరెక్టర్లుగా మంచి సక్సెస్ అయ్యారన్న సంగతి తెలిసిందే ..ఒకవైపు మంచి డాన్స్ కొరియోగ్రాఫర్ గా స్టేజ్లో ఉంటూనే దర్శకుడుగా హిట్ సాధిస్తున్నారు.

Amma Rajasekhar's foul talk on actor Nithiin - JSWTV.TV
డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తరువాత దర్శకుడిగా తమిళ సినిమాలతో సక్సెస్ అయ్యాడు తెలుగులో గోపీచంద్ హీరోగా రణం సినిమా తీసి హిట్ కొట్టాడు.. ఆ సినిమా హిట్ అవ్వడంతో ప్రభాస్ తో సినిమా చేయటానికి కథ సిద్ధం చేసుకున్నాడట అమ్మ రాజశేఖర్. ప్రభాస్ నుండి పిలుపు రావటంతో కథ చెప్పటానికి వెళ్లాల్సి ఉండగా వేరే కారణాల వల్ల రెండు రోజులు లేట్ అయింది. మళ్లీ అమ్మ రాజశేఖర్ వెళ్తే ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారని కలవటం కుదరదని చెప్పటంతో నేను అక్కడ ఉండకుండా వచ్చేసాను

ఆ సమయంలో అక్కడే ఉండి ఉంటే బాగుండేది. ఆ టైమ్ లో నితిన్ ఫోన్ చేసి ఒక పాటకు డాన్స్ మాస్టర్ కావాలని అడిగాడు. ఇక అటు ప్రభాస్ బిజీగా ఉండటంతో నేను నితిన్ తో సినిమా చేయాలని అనుకున్నాను. నితిన్ తో చేయాలని తమిళ్ డిజార్డర్ మూవీని రీమిక్స్ చేయాల్సి వచ్చింది. అదే టక్కరి సినిమా.. అది ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు కానీ చేశా దానివల్ల నా కెరీర్ నాశనం అయ్యింది. ప్రభాస్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేస్తుంటే నా కెరీర్ ఎంతో బాగుండేదని నితిన్ లాంటి హీరోతో చేయటం వల్ల నా కెరీర్ ఫ్లాప్ అయ్యిందని నితిన్ కి అది మంచి సక్సెస్ సినిమానే కావచ్చు.. కానీ నాకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది. నా కెరియర్ నేనే చేతులారా నాశనం చేసుకున్న అంటూ తెలిపారు అమ్మ రాజశేఖర్..

Share post:

Latest