ఇదేంట్రా బాబు.. మహేష్‌కు నచ్చని సినిమా భార్య నమ్రతకు ఫేవరెట్ మూవీయా..!

ఎస్ ఇది అందరికీ నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయం అనే అనుకోవాలి.. మహేష్ బాబు నటించిన డిజాస్టర్ సినిమాలలో మహేష్ కే నచ్చని ఓ సినిమా మహేష్ భార్య నమ్రతకు ఎంతో ఇష్టమట.. 27 ఏళ్ల మహేష్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, డిజాస్టర్లు కూడా ఉన్నాయి. మహేష్ నటించిన చివరి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్‌తో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తియిన వెంటనే దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.

Two decades for 'Vamsi': Mahesh Babu fell in love with Namrata on the sets of the film | Telugu Movie News - Times of India

ఇక మహేష్ నమ్రతను పెళ్లాడాక తన లైఫ్ స్టైల్ కెరియర్ను చాలా వరకు మార్చేసింది. ఇక మహేష్ నమ్రత మధ్య ప్రేమ పుట్టేలా చేసిన సినిమా వంశి.. ఈ సినిమాను కృష్ణ తన సొంత బ్యానర్ అయిన పద్మాలయ స్టూడియోస్ పై స్వయంగా నిర్మించాడు.. ఈ సినిమాలో నమ్రత హీరోయిన్గా నటించింది. 2000 సంవత్సరం అక్టోబర్లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరిగినప్పుడే మహేష్ నమ్రత మధ్య ప్రేమ చిగురించిందట.

Vamshi Telugu Full Movie | Mahesh Babu | Namrata | Telugu Movies | TVNXT Telugu - YouTube

ఆ సినిమా షూటింగ్ దగ్గర నుంచి నాలుగు సంవత్సరాలకు పైగా ప్రేమించుకున్న ఈ జంట 2005లో ముంబైలో వీరి పెళ్లి జరిగింది.. మహేష్ తన సినీ కెరియర్లో బాగా డిస్టర్బ్ చేసి పరువు తీసిన సినిమాలు బాబీ బ్రహ్మోత్సవాన్ని అంటారు. కానీ మహేష్ కు మాత్రం వ్యక్తిగతంగా పరువు తీసిన సినిమా వంశీ.. తన తండ్రి కృష్ణతో కలిసి నటించడం, అదేవిధంగా తన సొంత బ్యానర్, తన భార్య నమ్రతతో ప్రేమ చిగురించిన సినిమావంశి డిజాస్టర్ అవ్వటం మహేష్‌ను ఎంతగానో బాధించింది.

It's magical how Mahesh Babu and I found a home in each other: Namrata Shirodkar | Telugu Movie News - Times of India

ఇక క‌థ కూడా రెడీ కాకుండా హ‌డావిడిగా సినిమా తీసేశారు. ద‌ర్శ‌కుడు బీ.గోపాల్ అదే స‌మ‌యంలో బాల‌య్య‌తో న‌ర‌సింహానాయుడు చేస్తూ ఆ సినిమాపై ఎక్కువ ఫోక‌స్ చేయ‌డం వ‌ళ్ళే వంశీ ప్లాప్ అవ్వ‌డానికి కార‌ణ‌మ‌ని టాక్ ఉంది. సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు కూడా మ‌హేష్‌కు సినిమా తేడా కొడుతుంద‌ని అర్థ‌మైపోయింద‌ట‌. రిలీజ్ అయ్యాక మ‌హేష్ జోస్యం నిజ‌మై సినిమా ప్లాప్ అయ్యింది.

మహేష్, నమ్రతలను కలపిన 'వంశీ'కి 20 ఏళ్ళు! | Mahesh Babu Namrata Shirodkar Vamsi movie completes 20 years

క‌నీసం ఆర్టిస్టుగా కూడా మ‌హేష్‌కు ఏ మాత్రం సంతృప్తి క‌లిగించ‌ని సినిమాగా వంశీ రికార్డుల‌కు ఎక్కింది. అయితే ఈ ప్లాప్ సినిమాయే న‌మ్ర‌త‌కు బాగా ఇష్టం అట‌. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్నంత సేపు న‌మ్ర‌త ఎంజాయ్ చేస్తూ సినిమా చేయ‌డం.. అదే టైంలో మ‌హేష్‌తో తొలి చూపులు చిగురించ‌డంతో ఆ మెమ‌ర‌బుల్ మూమెంట్స్ ఆమెకు బాగా గుర్తుండిపోయాయి.

Share post:

Latest