ట్రైలర్: ట్రైలర్ తోనే ఉగ్రరూపం చూపిస్తున్న అల్లరి నరేష్..!!

గతంలో కామెడీకి కేరాఫ్ అడ్రస్గా నిలిచారు నటుడు అల్లరి నరేష్.. నాంది సినిమాతో ఒకసారిగా తన కెరీర్ను మళ్ళీ మార్చుకోవడం జరిగింది. ఆ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో తన కెరియర్ లో ఎన్నో కొత్త ఎనర్జిటిక్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. అల్లరి నరేష్ ఇక మీదట కామెడీ సినిమాలు చేయరనే ఫిక్స్ అయ్యారు అభిమానులు. డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వంలో వచ్చిన నాంది సినిమా హిట్ అవడంతో మరొకసారి ఆ దర్శకుడికె అవకాశం ఇచ్చారు అల్లరి నరేష్ ఆచిత్రమే ఉగ్రం.

Ugram Release Date, Cast Details, Story, Trailer and More!

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ని కూడా చిత్ర బృందం ఖమ్మంలో విడుదల చేసింది. ట్రైలర్ విషయానికి వస్తే టైటిల్ కి తగ్గట్టుగానే ఇందులో అల్లరి నరేష్ తన ఉగ్రరూపాన్ని చూపించారు అంటూ అభిమానులు ఆడియన్స్ తెలియజేస్తున్నారు. ఇందు లో అల్లరి నరేష్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఇందులో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో నటించబోతున్నట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. పూర్తిగా యాక్షన్ మాస్ సినిమాతో తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.

ఉగ్రం సినిమా ట్రైలర్ మాస్ ఆడియన్స్ను కూడా కట్టిపడేసేలా చేస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడుతోంది. మే 5వ తేదీన ఈ సినిమా విడుదల చేస్తున్నారు సమ్మర్లో సినిమాల సందడి మొదలయ్యిందని చెప్పవచ్చు ఇప్పటికే దసరా ,విరూపాక్ష వాటి సినిమాలు విడుదలై మంచి విజయాలుగా నిలిచాయి. మరి అల్లరి నరేష్ నటించిన ఈ ఉగ్రం సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి మరి. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది నరేష్ ఫుల్ లెన్త్ మాస్ హీరోగా ఇందులో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.