ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించిన స్టార్ హీరోయిన్.. అందుకేనా?

భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది సంయుక్త మీనన్. ఆ తరువాత ‘సార్’ సినిమాలో ధనుష్ తో కలిసి నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు సౌత్ లో చక్కర్లు కొడుతుంది. సంయుక్త ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అందుకే ఆమెది గోల్డెన్ లెగ్ అని సౌత్ ప్రేక్షకులు ఆమెని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

తాజాగా సంయుక్త మీనన్ ‘విరూపాక్ష’ సినిమాలో నటించింది. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన విరూపాక్ష సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మినన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంయుక్త మీడియా తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇంటర్వ్యూలో సంయుక్త మాట్లాడుతూ ‘ ఒకసారి నేను, మా అమ్మ బయటికి వెళ్ళాం. అప్పుడు అక్కడే ఉన్న ఒక వ్యక్తి మా పక్కనే నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ పొగ మాకు పడదు. అంతేకాకుండా మా అమ్మకి శ్వాస సంబంధిత సమస్య ఉంది. అందుకే అతని పక్కకి వెళ్లి తాగమని రిక్వెస్ట్ చేసాం. కానీ అతను మమల్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడాడు. దాంతో నాకు వచ్చి అతని చెంప పగలకొట్టాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సంయుక్త మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా సంయుక్త చాలా ధైర్యవంతురాలు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ నుంచి మరిన్ని సినిమాలు రావాలని తెలుగు ప్రేక్షకులు ఆశిస్తున్నారు.