ఆ కారణంగానే రెజీనా స్టార్ హీరోయిన్ కాలేకపోయిందా..!

హీరో సుదీర్ బాబు నటించిన ఎస్ఎంఎస్ సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ రెజీనా. ఆ తర్వాత సందీప్ కిషన్ తో రొటీన్ లవ్ స్టోరీ, రా రా కృష్ణయ్య, కొత్తజంట, పిల్ల నువ్వు లేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పవర్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఈ సినిమాలేవి కూడా ఈమెను స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించలేకపోయాయి. అంతేకాకుండా ఆ తర్వాత అవకాశాలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి.

Regina Cassandra Biography, Age, Wiki, Caste, Height, Affairs, Marriage

కొన్ని సంవత్సరాలు గ్యాప్ తర్వాత మళ్లీ అడవి శేషు నటించిన ఎవరు సినిమాలో నెగిటివ్ సీడ్ ఉన్న పాత్రలలో నటించింది. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్లలో కూడా నటించి ఓటీటి లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా సక్సెస్ కాలేక పోయింది. ఇదంతా ఇలా ఉంటే హీరోయిన్ రెజీనా పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి ఇంటిమేట్ సన్నివేశాలలో నటించడానికి అయినా సిద్ధంగానే ఉంటుంది. అలాంటప్పుడు ఈమెకు స్టార్ హీరోయిన్గా ఎందుకు ఎదగలేకపోయిందని అనుమానం అభిమానులలో తలెత్తుతోంది.

అయితే అందుకు కారణం టాలీవుడ్ హీరో తో ఈమె ప్రేమాయణం నడపడం కారణమంటూ అంత అంటూ ఉంటారు కానీ.. ముఖ్య కారణం మాత్రం ఈమె ఏ భాషలలో నటించిన అక్కడ పి ఆర్ టీమ్ ని మెయింటైన్ చేయదు.. హీరో హీరోయిన్లకు సరైన పిఆర్ఓ టీమ్ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతూ ఉంటారు. మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు. లేదంటే వారి వద్దకు మంచి ప్రాజెక్టులు వస్తాయన్న గ్యారెంటీ లేదు.. రెజీనా కూడా అంతే అందం టాలెంట్ ఉన్నప్పటికీ ఈ విషయంలో నెగ్లెట్ గా ఉండడంతో ఈమె స్టార్ హీరోయిన్గా కాలేకపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.