ఒకప్పుడు బుల్లితెరపై స్టార్ యాంకర్ కు ఒక వెలుగు వెలిగిన వారిలో యాంకర్ ఉదయభాను కూడా ఒకరు. ముఖ్యంగా తన పంచ్ డైలాగులతో మాడ్యులేషన్ తో అతి తక్కువ సమయంలో స్టార్ యాంకర్ గా ఎదిగింది. పల్లెటూరులో ఏర్పాటు చేసిన కొన్ని షోలు, డాన్సులు వంటి వాటి ద్వారా మంచి పాపులారిటీ. సుమ, ఝాన్సీ తదితర యాంకర్స్ బుల్లితెరని ఏలుతున్న సమయంలో కూడా ఉదయభాను ఎంట్రీ ఇచ్చి తన హవా కొనసాగించింది.
ముఖ్యంగా అప్పట్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న యాంకర్ గా కూడా రికార్డు సృష్టించింది.. యాంకర్లు కూడా గ్లామర్ చూపించగలరు అనేటటువంటి సెట్ చేసింది యాంకర్ ఉదయభాను.. అయితే తన కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో 15 సంవత్సరాలకే హోస్టుగా మారిన ఉదయభాను మొదటిసారిగా హృదయాంజలి అనే ప్రోగ్రామ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింభకా ,జానవులే నెరజాణవులే తదితర వంటి షోలలో యాంకర్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
అయితే కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగులను హీరోయిన్గా కూడా నటించింది ఉదయభాను. కానీ ఇవి పెద్దగా ఈమెకు వర్కౌట్ కాలేకపోయాయి. ఉదయభాను పర్సనల్ లైఫ్ లో ఏర్పడిన ఇబ్బందులు కారణంగా కొన్నేళ్లపాటు ఇమే సినీ ఇండస్ట్రీకి దూరమైంది. 2004లో విజయ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇది రెండో పెళ్లి అని అప్పట్లో ఎక్కువగా చర్చ జరిగింది.. తాజాగా ఉదయభాను కు సంబంధించి ఒక పెళ్లి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. సినిమాలకు దూరమై కేవలం తన భర్త పిల్లలతోనే తమ సమయాన్ని ఎక్కువగా గడిపేస్తున్నట్లు తెలుస్తోంది ఉదయభాను.
View this post on Instagram