కాలిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన `శాకుంతలం` ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించారు. దిల్ రాజు, నీలమ గుణ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఏప్రిల్ 14న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి.. యావరేజ్ టాక్ లభించింది. దాంతో తొలి రోజు అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది. ఇక రెండో రోజు శాకుంతలం వసూళ్లను దారుణంగా డ్రాప్ అయిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండో రోజు రూ. 51 లక్షలు షేర్ ని మాత్రమే అందుకోగా.. వరల్డ్ వైడ్ గా రూ.71 లక్షలతో సరిపెట్టుకుంది. రెండో రోజే ఇలాంటి కలెక్షన్స్ రావడం అంటే స్టార్ హీరోయిన్ సమంతకు ఘోర అవమానం జరిగినట్లే. ఇక ఏరియాల వారీగా శాకుంతలం 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం: 73 లక్షలు
సీడెడ్: 16 లక్షలు
ఉత్తరాంధ్ర: 23 లక్షలు
తూర్పు: 12 లక్షలు
పశ్చిమ: 7 లక్షలు
గుంటూరు: 11 లక్షలు
కృష్ణ: 12 లక్షలు
నెల్లూరు: 5 లక్షలు
————————————
ఏపీ+తెలంగాణ= 1.59 కోట్లు(3.15 కోట్లు~ గ్రాస్)
————————————
తమిళం – 26 లక్షలు
రెస్టాఫ్ ఇండియా – 25 లక్షలు
ఓవర్సీస్- 85 లక్షలు
———————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 2.95 కోట్లు(6.15 కోట్లు~ గ్రాస్)
———————————————
కాగా, రూ. 18 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ లెక్కన మొదటి రెండు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 16.05 కోట్లు రాబడితే బాక్సాఫీస్ వద్ద శాకుంతలం క్లీన్ హిట్ గా నిలుస్తుంది.