ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ మిట్స్ ను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ రీసెంట్ గా `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శతక్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమాన్యువల్, మేఘా అకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు.
సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రవితేజ అద్భుతంగా నటించాడంటూ చాలా మంది ప్రశంసలు కురిపించారు. కానీ, టాక్ బాగున్నా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది.
వీకెండ్స్ లో కూడా ఈ సినిమాకు వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఓవరాల్ గా 8 రోజుల్లో 11.81 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 10.50 కోట్లు రాబట్టాలి. ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే రెండు వారాలలోపే మూవీ క్లోజ్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక లాంగ్ రన్ లో 50 లక్షుల కూడా రవడం కష్టమే అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాకు పది కోట్ల రేంజ్ లో నష్టాలు ఖయమనే టాక్ వినిపిస్తోంది.