ఏ సినీ ఇండస్ట్రీలో నైనా కొంతమంది హీరోయిన్స్ తమ అందంతో నటనతో ఆకట్టుకుంటూ ఉంటారు. అలా ఆకట్టుకొని తక్కువ సినిమాలలోని నటించి కనుమరుగైన వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ అన్షు అంబానీ కూడా ఒకరు. 2002లో నాగార్జున హీరోగా, డైరెక్టర్ విజయభాస్కర్ కాంబినేషన్లో వచ్చిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.ఇందులోని కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ కూడా బుల్లితెరపై ప్రసారమయ్యయి అంటే చాలు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి.
ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించింది అన్షు అంబానీ ప్రస్తుతం ఇమే గురించి ఆమె అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు.. ఈ ముద్దుగుమ్మ ఏం చేస్తోంది ..ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఫ్యాషన్ డిజైనర్ అయిన అన్షు అంబానీ 2002లో మన్మధుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇదే తొలి చిత్రం.అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఒకేసారి ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించే అవకాశం సంపాదించుకుంది. దీంతో ఈమెకు మంచి పాపులారిటీ సంపాదించింది అలాగే తమిళంలో జై సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
సరైన అవకాశాలు వస్తున్నాయి కానీ 2003లో సచిన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని లండన్ లో సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ కు ఒక పాప కూడా జన్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సొంతంగానే వ్యాపారం చేసుకుంటూ అక్కడే కనిపిస్తోంది అన్షు అంబానీ. ప్రస్తుతం ఇమే కుటుంబానికి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి